జనసంఘ్ స్థాపనతో జాతీయవాద రాజకీయాలకు అంకురార్పణ చేసిన మహానేత డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ: క‌సిరెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి, ఆర్టికల్ 370ని వ్యతిరేకిస్తూ దేశ సమైక్యత కోసం బలిదానమైన గొప్ప నాయకుడని బిజెపి రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. డాక్ట‌ర్ శ్యాం ప్ర‌సాద్‌ జయంతి సందర్భంగా గౌతమీనగర్ మున్సిపల్ పార్కులో బిజెపి కాంటెస్టెడ్ క్యాండిడేట్ కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి, డివిజన్ బిజెపి అధ్యక్షుడు గొల్లపల్లి రాంరెడ్డిల‌తో కలిసి క‌సిరెడ్డి మొక్కలు నాటారు. అనంత‌రం ఆయన మాట్లాడుతూ… పశ్చిమ బెంగాల్, తూర్పు పంజాబ్ ప్రాంతాలు పాకిస్తాన్ లో చేరకుండా ఆవిర్భావానికి ముందే ఆ దేశాన్ని చీల్చిన ధైర్యశాలి అని కొనియాడారు. జనసంఘ్ స్థాపనతో దేశంలో జాతీయవాద రాజకీయాలకు అంకురార్పణ చేసిన మహానేత అని, స్వతంత్ర‌ భారత తొలి పరిశ్రమల శాఖ మంత్రిగా స్వదేశీ వైజ్ఞానిక ప‌రిశోధ‌నా సంస్థ‌లకు, పారిశ్రామిక అభివృద్ధికి పునాది వేసిన కార్య‌ద‌క్ష‌త ఆయ‌న సొంత‌మ‌ని అన్నారు. చిన్న వయసులో కలకత్తా విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ పదవి చేపట్టిన విద్యావేత్త డాక్ట‌ర్ శ్యామ ప్ర‌సాద్ ముఖ‌ర్జీ అని తెలిపారు. ముఖ‌ర్జీ జయంతి సంద‌ర్భంగా ఆ మ‌హానాయ‌కుని ఆశ‌యాల‌ను కొన‌సాగించేందుకు పున‌రంకితమ‌వుదామని కసిరెడ్డి భాస్కరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయ‌కులు వేణుగోపాల్ పగడాల, శ్రీనివాస్ ముదిరాజ్, లలిత, గూడూరి త్రినాథ్, అమరేంద్ర ప్రతాప్ సింగ్, యువమోర్చ డివిజన్ అధ్యక్షుడు మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.

గౌత‌మిన‌గ‌ర్ పార్కులో మొక్క‌లు నాటుతున్న క‌సిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, గొల్ల‌ప‌ల్లి రాంరెడ్డి, క‌సిరెడ్డి సింధు ర‌ఘునాథ్‌రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here