నిరుపేద విద్యార్థిని చ‌దువుకు హోప్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ కొండా విజ‌య్‌కుమార్ చేయూత‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: నిరుపేద విద్యార్ధి చ‌దువుకు హోప్ ఫౌండేష‌న్ చేయూత‌నందించింది. హ‌ఫీజ్‌పేట్ ప్రాంతానికి చెందిన జ్యోతి స్థానికంగా డిగ్రీ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతుంది. కాలేజీలో ఫీజు మొత్తం చెల్లించాల్సి ఉండ‌గా హోప్ ఫౌండేష‌న్ సేవ‌ల గురించి తెలుసుకుని చందాన‌గ‌ర్ హూడా కాల‌నీలోని ఫౌండేష‌న్ కార్యల‌యంలో మంగ‌ళ‌వారం చైర్మ‌న్ కొండా విజ‌య్‌కుమార్‌ను క‌లిసింది. త‌న ప‌రిస్థితి గురించి వివ‌రించడంతో సానుకూలంగా స్పందించిన విజ‌య్‌కుమార్ జ్యోతికి రూ.8 వేలు ఆర్ధిక స‌హాయం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ చ‌దువుకోవాల‌ని శ్ర‌ద్ధ ఉండి ఫీజులు చెల్లించ‌లేని ప‌రిస్థితి ఉన్న విద్యార్థుల‌కు హోప్ ఫౌండేష‌న్‌, ల‌య‌న్స్ క్ల‌బ్ ఆఫ్ హైద‌రాబాద్ హోప్ త‌ర‌పున తోచిన స‌హ‌కారం అందిస్తున్న‌ట్టు తెలిపారు. ఆ ప‌రిస్థితిలో ఉన్న నిరుపేద విద్యార్థులు త‌మ‌ను సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని అన్నారు.

విద్యార్థిని జ్యోతికి రూ.8 వేల న‌గ‌దు అందజేస్తున్న హోప్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ కొండా విజ‌య్‌కుమార్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here