నమస్తే శేరిలింగంపల్లి : రాబోయే పార్వమెంట్ ఎన్నికల దృష్ట్యా సిద్దిఖీ నగర్లో మాదాపూర్ పోలీసులు, కేంద్ర సాయుధ బలగాల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తమకు సమాచారం అందించాలని, ప్రజలు స్వేఛ్చాయుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకూ కొనసాగింది.