నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డికి మద్దతుగా కొండాపూర్ డివిజన్ మస్తాన్ నగర్ కాలనీలో కార్పొరేటర్ హమీద్ పటేల్ ఇంటి ఇంటి ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి తమ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ కు ఓటు వేసి డా రంజిత్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
స్థానిక నాయకులతో కలసి ప్రతి ఓటరును కలసి కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను వివరించి ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాన్, జంగం గౌడ్, లక్ష్మి నారాయణ, విష్ణు, లక్ష్మణ్ ముదిరాజ్, స్వామి సాగర్, మొహ్మద్ ఖాసీం, సులోమాన్, కేశం కుమార్, శ్రీరామ్ మూర్తి, సయ్యద్ ఉస్మాన్, గొలుసుల నరసింహ, వల్లెపు శ్రీను, శంకర్ నాయక్, శ్రీను చౌదరి, బాబా, ఘోస్, సాదిక్, సంతోష్, భరత్, రంగారెడ్డి, మల్లేష్, కిరణ్ గౌడ్, చాకలి నారాయణ, సత్యనారాయణ, బీర్ల గణేష్, కందడి మాణిక్యాల రావు, సత్యం, బండారి వెంకట్ రెడ్డి, యాదయ్య గౌడ్, టీ. శ్రీనివాస్ పాల్గొన్నారు.