- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణన్నపై దాడిని ఖండిస్తూ నిరసన
నమస్తే శేరిలింగంపల్లి : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ ముద్దుబిడ్డ ఆర్ కృష్ణన్నపై దాడి పిరికిపంద చర్య బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ దుయ్యబట్టారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో ఆర్ కృష్ణయ్య పై జరిగిన దాడిని ఖండిస్తూ ఐక్యవేదిక సభ్యులతో కలిసి శేరిలింగంపల్లి రైల్వే బ్రిడ్జి చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
ఐక్యవేదిక సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదు దశాబ్దాలుగా బీసీల కోసం పోరాడుతున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణన్నపై రాయి బీసీలను చిన్నచూపు చూస్తూ బీసీలపై దాడులు చేయాలనుకునే వారికి తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. ఈ దాడికి నిరసనగా రాష్ట్రంలో జిల్లాలలో మండలాలలో, గ్రామాలలో, వాడవాడలో బిసి నాయకులు, యువకులు మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బిసి ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ, సీనియర్ జర్నలిస్ట్, శేరిలింగంపల్లి యాదవ సంఘం ఉపాధ్యక్షులు అందేలా సత్యనారాయణ యాదవ్, రాష్ట్ర బీసీ నాయకులు యాదయ్య, ఉమా శంకర్, తిరుపతయ్య సాగర్, రాజేష్, వెంకటేష్, దశరథ్, పాండు, రాము, మల్లేష్, రవి, సునీల్, రమేష్ పాల్గొన్నారు.