కొనసాగుతున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా

నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా సందర్బంగా నిర్వహించే చేనేత హస్తకళా ఉత్పత్తులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నవి.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం కర్గం

డెవలప్మెంట్ కమీషనర్, హ్యాండ్లూమ్స్ , మినిస్ట్రీ అఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ అఫ్ ఇండియా ఆధ్వర్యం లో విచ్చేసిన చేనేత హస్తకళా కళాకారులూ ఉదయం 10 .30 నుండి రాత్రి 8 .00 గంటలవరకు శిల్పారామం ఆవరణంలో కొలువుదీరి ఉండగా.. భారతదేశంలో వివిధ రాష్ట్రాలకి చెందిన చేనేత హస్తకళా ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకుంటున్నవి. సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూర్ వారి సౌజన్యం తో రాజస్థాన్ కి చెందిన కిరణ్ బృందం చక్రి నృత్యం , తమిళనాడు రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం కర్గం, కావడి , తప్పటం అంశాలు ఎంతగానో ఆకట్టుకున్నవి.

భరతనాట్య ప్రదర్శనలో..

డాక్టర్ వనజ ఉదయ్ శిష్య బృందం , కరుణ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన కోల్ కతా నుండి విచ్చేసిన డాక్టర్ దెబీజాని ఛటర్జీ బృందం ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నవి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here