నమస్తే శేరిలింగంపల్లి : మాస్టర్ అథ్లెట్ రాష్ట్ర స్థాయి పోటీల్లో రంగారెడ్డి మాస్టర్ అథ్లెట్ సత్తా చాటాలని మాస్టర్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అద్యక్షుడు కొండ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. చందానగర్ పిజెఆర్ స్టేడియంలో నిర్వహించిన మాస్టర్స్ ఎంపిక కార్యక్రమానికి కొండ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
30, 31 తేదిల్లో గచ్చౌబౌలి స్టేడియంలో చేపడుతున్న రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొనే రంగారెడ్డి జిల్లా టీం సభ్యుల ఎంపికతోపాటు ఎంపికైన వారికి ట్రాక్ సూట్లను సెక్రటరీ నూనె సురేందర్, ట్రెజరర్ స్వాతి గౌడ్ తో కలసి కొండ విజయ్ హాజరై అందజేశారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తుమ్మల ఏసురత్నం, లీలావతి, నాగలక్ష్మీ, మానస, జ్యోతి, జితేందర్ పటేల్ పాల్గొన్నారు.