ప్రతి ఇంటికి పథకాలు అందేలా చూస్తాం

  • శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పర్యటించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్
  • ప్రతి కేంద్రంలో ప్రజలకు అవసరాలకు అనుగుణంగా దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసిన కేంద్రాల ఇంచార్జ్ అధికారులు

నమస్తే శేరిలింగంపల్లి : ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అన్ని విధాలుగా అందేలా చూస్తామని, ప్రజా పాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను సాగిస్తుందని, ప్రజా పాలనకు నిదర్శనమే నేటి కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. అల్విన్ కాలనీ డివిజన్ శంశిగుడాలో పీజేఆర్ నగర్ వార్డు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ అపోహలను నమ్మవద్దని, దరఖాస్తు ఫారాలు పుష్కలంగా సెంటర్ల వద్ద అందుబాటులో ఉంచడం జరుగుతుందని, ప్రజలు నేరుగా సెంటర్ల వద్దకు వచ్చి అప్లికేషన్స్ ఫారం లు తీసుకోవచ్చని, ఫారం ఫిల్ చేయడానికి ఎలాంటి సందేహాలు ఉన్న అధికారుల సహాయం తీసుకోవాలని తెలిపారు.

క్యూ లైన్లో నిల్చున్న ప్రజలతో మాట్లాడుతున్న జగదీశ్వర్ గౌడ్

ప్రజలందరూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల పథకాలు అర్హులైన పేద ప్రజలకు అందించే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ప్రజల నుంచి మహాలక్ష్మి, అభయ హస్తం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తులను నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద దరఖాస్తులను స్వీకరిస్తారని, రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను ఎంపిక చేయాలని తెలిపారు.

దరఖాస్తు ఫారం గురించి వివరిస్తున్న జగదీశ్వర్ గౌడ్

క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, అర్హులైన లబ్ధిదారులందరు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here