నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో అంతర్జాతీయ నృత్యోత్సవం సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. కందులకూచిపూడి నాట్యాలయం గురు రవి కూచిపూడి, శిల్పారామం సంయుక్తంగా “నాట్య తరంగిని ” నృత్యోత్సవాన్ని నిర్వహించారు.
కలకత్తా నుండి రాజీబ్ ఘోష్ తన బృందంతో కథక్ నృత్య ప్రదర్శనలో శివతాండవం, తరణ అంశాలను.. ఒరిస్సా నుండి దేబశీష్ పట్నాయక్ ఒడిసి నృత్య ప్రదర్శనలో మధురాష్టకం, ఆంగిక, అంశాలను.. టొరంటో కెనడా నుండి విచ్చేసిన శక్తి సంజన సిరాలా , రిషికేష్ దేవి కీర్తనం అంశాలను.. మొహినియాట్టం స్వర్ణదీప, ఓమనథింకర్ కిడావో , హిందీ భజన్, పేరిణి తాండవం శ్రీ పేరిణి సంతోష్ పెరుమాండ్ల శంకర గిరిజ అంశాలను.. రవి కూచిపూడి శిష్య బృందం కూచిపూడి నృత్యం లో పూజ నృత్యం, ఆధ్యాత్మ రామాయణ కీర్తన , జయము జయము, మూషిక వాహన అంశాలను ప్రదర్శించారు.
ప్రముఖ నాట్య గురువు సంజయ్ జోషి, వేదాంతం సత్య నరసింహ శాస్త్రి విచ్చేసి కళాకారులను సత్కరించారు.