నమస్తే శేరిలింగంపల్లి : ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా హఫీజ్ పేట్ 109 డివిజన్ పరిధిలోని ఆర్ కే నగర్ లో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్చార్జి బాలింగ్ గౌతమ్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాసాని జ్ఞానేశ్వర్ కి ఓటు వేసి భారి మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలకు విన్నవించారు.
ఈ కార్యక్రమంలో వాళ్ల హరీష్ రావు, లక్ష్మారెడ్డి , మిద్దెల మల్లారెడ్డి , బాబు మోహన్ మల్లేష్, రామకృష్ణ గౌడ్, వేణు జాగృతి, పవన్ గౌడ్, జనార్దన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, బాబు గౌడ్, జమీర్, సాబీర్, షబానా, సురేష్, గోపాల్, గణేష్ రెడ్డి, రాజు, సాయి, డివిజన్ లోని కార్యకర్తలు, ఉద్యమకారులు, సీనియర్ నాయకులు , బీఆర్ఎస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.