నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో గురు పౌర్ణిమ పండగ పురస్కరించుకొని పద్మవిభూషణ్ డాక్టర్ వెంపటి చిన్న సత్యం కుమార్తె చావళి బాలాత్రిపురసుందరి శిష్యబృందం గురుపూజోత్సవం నిర్వహించారు.
పరి పాహి, జతిస్వరం, ఆనందతాండవం, దశావతరం, సూర్య స్తుతి, బృందావన నిలయ్ తిల్లాన అంశాలను కుమారి సౌమ్య, సంయుక్త, వైష్ణవి, సహన, వెంకట్, శశికళ, శ్రీయ, శ్రీ మృత్యుంజయ శర్మ, ప్రియా హాసిని, అనురిత, ఇషితా, చైత్రహాస్ మొదలైన వారు ప్రదర్శించారు. శాశ్వతి బెనర్జీ శిష్య బృందం చేపట్టిన కథక్ నృత్య ప్రదర్శనలో రాధాకృష్ణ, గురువందనా, సూఫీ సంగీతం అంశాలను ప్రదర్శించారు.