నమస్తే శేరిలింగంపల్లి : శిల్పరామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. మేధా శ్రీగిరి కూచిపూడి నృత్య ప్రదర్శనలో వందే ఉమా సుతం, జయదేవ అష్టపడి సంచారధారాధ, మండూక శబ్దం అంశాలను ప్రదర్శించి మెప్పించారు.
మాయ డాన్స్ అకాడమీ భావన గౌరీ బృందం భరతనాట్య ప్రదర్శనలో నటేశ కౌతం, ఓం గ్రీమ్, ఝాన్సీకి రాణి, విషమ కార కణ్ణన్, తిల్లాన అంశాలను రుహాణి, ఐర, భావన, సౌరభ్, అనన్య, విపిన్, అలంకృత, డోయల్ మొదలైనవారు ప్రదర్శించి మెప్పించారు. అన్నరావు, ప్రముఖ నాట్య కళాకారిణి పూజిత కృష్ణ ముఖ్య అతిధులుగా విచ్చేసి కళాకారులను అభినందిచారు.