నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో అంతర్జాతీయ హస్తకళా ఉత్సవం ఎంతగానో ఆకట్టుకుంటున్నది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆద్యంతం అలరిస్తున్నాయి.
మేళాలో భాగంగా బనారసీ, కలంకారీ , కోట, మస్లిన్, జాంధానీ , కాశ్మీరీ సిల్క్, బెంగళూరు సిల్క్ చీరలు , గుజరాతి డ్రెస్సెస్ , హ్యాండ్ బాగ్స్, బెడఁషీట్స్, వరంగల్ కార్పెట్స్, వుడ్ కార్వింగ్, చెక్క విగ్రహాలు, ఆర్టిఫిషల్ జ్యువలరీ, ఇత్తడి విగ్రహాలు, చెప్పులు, చీరలు, డ్రెస్ మెటీరియల్స్, మధుబని పెయింటింగ్, ఎన్నో మరెన్నో చేనేత హస్తకళా ఉత్పత్తులు సందర్శకులకు అందుబాటులో ఉండి ఆకర్షిస్తున్నాయి.
సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూర్ సౌజన్యంతో ప్రదర్శిస్తున్న అస్సాం రాష్ట్రానికి చెందిన గౌతమ్ కుమార్ దాస్ బృందం బిహు డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వాతి సోమనాధ్ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన , తాండవ ఆర్ట్స్ మధుసూదన్ తన శిష్య బృందంతో ప్రదర్శించిన అంశాలు ఎంతగానో అలరించాయి.