నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉమా మహేశ్వరి గారి శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.
అంబపరకు, రంగపూజ, పుష్పాంజలి, వర వల్లభ రమణ, ఫాలనేత్రానల, అయిగిరినందిని, అలరులు కురియగ, కలశపురం, శివాష్టకం, సూర్యాష్టకం, వసంత జతీస్వరం, అర్ధనారీశ్వరం, కొలనిదోపరికి గొబ్బిళ్ళో మొదలైన అంశాలను కళాకారులు అధ్యా, అక్షయ, అమేయ, హాసిని, హిమ, జోషిత, కౌస్తుభి, కిరణ్మయి, కృతి, ప్రీతిక, రియాంశిక, సాహితీ, సమీక్ష, ప్రదర్శించి మెప్పించారు.