నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణలోని మొత్తం 39 రైల్వే స్టేషన్లను గుర్తించి (అమృత్ భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా) సంపూర్ణంగా ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం మనకు తెలిసిందే. ఇందులో మొదటి విడతగా తెలంగాణకు సంబందించిన 21 స్టేషన్ల ఆధునీకరణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ ప్రారంభించారు.
‘అమృత్ భారత్ స్టేషన్ల’ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి ప్రయాణి కులకు వెయిటింగ్ హాల్స్, టాయిలెట్స్, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ఉచిత వై-ఫై సదుపాయాన్ని కూడా కల్పించనున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెంట్ ఎమ్మెల్యే మొవ్వ సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.