నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నారాయణి నాట్యాలాయ గురువు సంతోష్ కుమార్ తమంగ్ శిష్య బృందం చేసిన భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. పుష్పాంజలి, జతిస్వరం, శబ్దం, పడవర్ణం, శివ స్తుతి, పదం, శ్రీనగరళహరి, భజన, తిల్లాన, మంగళం అంశాలను అవని కశ్యప్, గౌరీ, నివేద్య, అస్మిత దాస్, లావణ్య, సిరి చందాన, కృష్ణ ప్రియా, హారాన్ని శ్రీనివాసన్, నిషిక, సోమా, అనౌష్క, కుండానే, స్తుతి భట్, స్వాతిక, మౌనిక ఊర్వశి మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు. ముఖ్య అతిధులుగా ప్రముఖ నాట్య గురువు గీతా గణేశన్, డాక్టర్ విజయాపత్లోత్, ప్రీతీ మహాపాత్రో విచ్చేసి కళాకారులను ఆశీర్వదించారు.