పేదలకు తోచినంతగా సహాయం చేస్తా : విద్యార్థి నేత రవీందర్ యాదవ్

  • విద్యార్థి నేత రవీందర్ యాదవ్ కు అరుదైన పురస్కారం..!
  • కీర్తి కిరిటి జాతీయ పురస్కార్ అవార్డును అందజేసిన ఆ సంస్థ ప్రతినిధులు

నమస్తే శేరిలింగంపల్లి: కరోనా ఆపత్కాలంలో ప్రతి క్షణం పేద ప్రజలకు అండగా నిలిచినందుకు.. పేద విద్యార్థులకు తన వంతుగా సహాయ, సహకారాలు అందించినందుకు గాను తెలంగాణ విద్యార్థి విభాగం నాయకుడు రవీందర్ యాదవ్ ను అరుదైన పురస్కారం వరించింది. ఈ సందర్బంగా పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇండో – కెనెడియన్ యూత్ కౌన్సిల్ కెనడా గ్లోబల్ క్రియేటివ్ ఆర్ట్ అకాడమీ అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు “కీర్తి కిరిటి జాతీయ పురస్కారం” అందుకోగా.. శనివారం సాయంత్రం ఆ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్, నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ హాల్లో ఆ అవార్డును రవీందర్ యాదవ్ కు ప్రదానం చేశారు. కరోనా మొదటి వేవ్ నుంచి పేద ప్రజలకు నిత్యావసరాలు, దుప్పట్లు, మాస్కులు, శానిటేషన్లు పంపిణి చేస్తు కరోనా సమయం లో అండగా నిలిచాడు. అనాథాశ్రమలలో అన్నదానాలు, వస్తువులు అందించాడు. ప్రభుత్వ పాఠశాల లో పేద విద్యార్థులకు పుస్తకాలను, ఆటవస్తువులను ఇచ్చి చదువులో రాణించాలని ప్రోత్సహించాడు. అయితే తన సేవలకు గుర్తించి అవార్డు ప్రధానం చేసిన ప్రతినిధులకు రవీందర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు పేద ప్రజలకు తనకు తోచిన విధంగా సహాయం చేసి అండగా నిలుస్తానని రవీందర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.

కీర్తి కిరిటి జాతీయ పురస్కార్ అవార్డుతో విద్యార్థి నేత రవీందర్ యాదవ్

కీర్తి కిరిటి జాతీయ పురస్కార్ అవార్డుతో సత్కారం పొందుతున్న విద్యార్థి నేత రవీందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here