ట్రెజరర్ గా స్వాతి ధర్మపురి
నమస్తే శేరిలింగంపల్లి: మాస్టర్ అథ్లెటిక్ రంగారెడ్డి జిల్లా కమిటి సమావేశం శనివారం చందానగర్ హుడా కాలనీలో నిర్వహించారు. జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ అనుసాందనంగా కొనసాగుతున్న తమ అసోసియేషన్ ద్వారా క్రీడలకు మరింత ప్రోత్సాహం అందజేయనున్నట్లు నూతన కమిటి అద్యక్షుడు కొండ విజయ్ కుమార్, కార్యదర్శి నూనె సురేందర్, ట్రెజరర్ స్వాతిలు తెలిపారు. కమిటి సభ్యులం కలిసి కట్టుగా ముందుకు సాగనున్నట్లు తెలిపారు. జనవరి లో నిర్వహించే రాష్ర్ట మాస్టర్స్ ఆథ్లెటిక్ పోటీలను జనవరిలో నిర్వహించనున్నట్లు, ఈ మేరకు డిసెంబర్ 11 పిజెఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు అద్యక్షుడు కొండ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్ డగ్లస్ , లక్ష్మీనారాయణ, సితిజ , మల్లేశ్వర, శారద , అథ్లెట్లు పాల్గొన్నారు. అద్యక్షుడుగా కొండ విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్షిగా నూనె సురేందర్, ట్రెజరర్ గా స్వాతి దర్మపూరి, ఉపాధ్యక్షులుగా ఏసురత్నం, డగ్లస్ ఆర్గనైజింగ్ సెక్రటరిగా మానస, జాయింట్ సెక్రటరీలుగా జితేందర్ పటేల్, జ్యోతి,కార్యవర్గ సభ్యులుగా సవిత, శైలజ, శివలీల, రాజు బాశెట్టి, శ్రీనివాస్ ముదిరాజ్ పాల్గొన్నారు.