నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నోరా’స్ మ్యూజిక్ అకాడమీ గురువు నరేన్ ఆధ్వర్యం లో ఆయన శిష్య బృందం దేశ భక్తి గీతాలను ఆలపించారు. వీరికి తబలా పై జాన్, పాడ్స్ పై విజయ్, కీబోర్డు పై శ్రీను, భ రతనాట్యాలాయ గురువు చిత్ర నారాయణ శిష్య బృందం పుష్పాంజలి, బ్రోవ వరమా, కంససురా తరంగం, మతే మలయద్వాజేయఁ వర్ణం, ఓంకార భీజాక్షరీ, తిల్లాన అంశాలను శ్రీజ, శ్రీదేవి, సంజన, శ్రీహన్సికా, వర్షిణి, రిషితలు భరతనాట్య ప్రదర్శనలో మెప్పించారు.