నమస్తే శేరిలింగంపల్లి: మోడీ పర్యటన నేపథ్యంలో ముందస్తుగా అరెస్టు చేసిన వామపక్ష నాయకులను బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి సిపిఐ రామకృష్ణ అన్నారు. విభజన చట్టానికి తూట్లు పొడుస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తూ, పౌర హక్కులను కాలరాస్తున్న మోడీకి స్వాగతం పలకాలా.. తెలంగాణ ప్రజల ఉద్యమ సత్తాను మోడీకి చవిచూపిస్తామన్నారు. దేశ సంపదను దోచిపెడితే చూస్తూ ఊరుకోమని, బయ్యారం ఉక్కు కర్మాగారం, ఖాజీ పేట కోచ్ ఫ్యాక్టరీ, కేంద్ర విద్యాలయాల కోసం మోడీపై పోరాటం ఇక ఆగదని స్పష్టం చేశారు.