- బిజెపి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి హోదాలో విమానాశ్రయంలో వీడ్కోలు…
నమస్తే శేరిలింగంపల్లి: భారత ప్రధాని నరేంద్ర మోడీని కలవడం తన అదృష్టంగా భావిస్తున్నాని బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ పేర్కొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీని శనివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర పర్యటన ముగించుకొని తిరుగు పయనమైన ప్రధానికి వారు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ యుగపురుషుడు, కారణజన్ముడు, భారతదేశానికి సుస్థిర పాలనను అందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత నాయకుడు నరేంద్ర మోడీని కలవడం జీవితంలో మర్చిపోలేని ఘట్టమని అన్నారు. ఒక సాధారణ కార్యకర్తకు ప్రధానమంత్రిని కలిసే అరుదైన అవకాశం దక్కడం ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమని అన్నారు. తన సేవలను గుర్తించి ప్రియతమ ప్రధానిని కలిసే గొప్ప భాగ్యాన్ని కల్పించిన భాజపా రాష్ట్ర నాయకత్వానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.