ఎంసిపిఐయు 5వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి : జిల్లా కార్యదర్శి వి. తుకారం నాయక్

  • మియాపూర్ చౌరస్తా నుంచి గంగారం వరకు బైక్ ర్యాలీ

నమస్తే శేరిలింగంపల్లి: ఎంసీపీఐయు పార్టీ జాతీయ 5వ మహాసభలను విజయవంతం చేయాలని మియాపూర్ చౌరస్తా నుంచి గంగారం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కార్యదర్శి వి. తుకారం నాయక్ మాట్లాడుతూ 38 ఏండ్ల క్రితం ఏర్పడిన ఎంసిపిఐయు పార్టీ అంచలంచెలుగా దేశవ్యాప్తంగా విస్తరించిందని తెలిపారు. ఇందులో భాగంగా బీహార్ రాష్ట్రంలోని ముజాఫర్ పూర్ లో నవంబర్ 12 -15 వరకు జాతీయ5వ మహాసభలు నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. నేడు దేశంలో అధికారంలో ఉన్న బిజెపి దేశ ప్రజల ఆచార సంస్కృతిక జీవన విధానంపై అత్యంత దుర్మార్గమైన పద్ధతులలో నిర్బంధం చేస్తుందని, ఈ సమయంలో సామాజిక న్యాయం కోసం తీవ్రమైన ఉద్యమాల నిర్మాణం మెజారిటీ ప్రజల రాజ్యాధికారానికి రావడం అత్యంత చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన అంశముగా ఎంసిపిఐయు పార్టీ భావిస్తుందని చెప్పారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లదనం వెనక్కి తెచ్చి ప్రతి పౌరుని ఖాతాలోకి రూ. 15 లక్షల వేస్తానన్న మోదీ, ఇచ్చిన భరోసాను తుంగలో తొక్కారన్నారు. ఉద్యోగ ఉపాధి లేకుండా జీవన భద్రతపై ఆందోళన చెందిన కోట్లాదిమంది నిరుద్యోగ యువత నేడు పెడదారి పట్టే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. జిఎస్టి పేరుతో పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను నిత్యం పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ, గుజరాతి అమిత్ షా పాలన పారద్రోలే వరకు.. ప్రజలు, ప్రజాతంత్ర వాదులు ఏకమై పోరాడాలని ఈ వేదికపై పిలుపునివ్వనున్నట్లు తెలిపారు. ఎంసిపిఐయు 5వ జాతీయమహాసభలను అన్నివర్గాల ప్రజలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంసిపిఐయు గ్రేటర్ కమిటీ కార్యవర్గ సభ్యుడు కర్ర దానయ్య, తుడుం అనిల్ కుమార్, పల్లె మురళి, డివిజన్ కమిటీ సభ్యులు రంగస్వామి, శాఖ సభ్యులు శ్రీనివాస్, సిబి. శివ ఎండీ ఆన్సర్, సోను నాయక్,. ఎండీ మౌలానా ఎండీ. గాఫర్ గోపాల్ నాయక్ పాల్గొన్నారు.

మియాపూర్ చౌరస్తా నుంచి గంగారం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎంసీపీఐయు పార్టీ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here