డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి బకెట్ క్లినింగ్

  • పూడిక తీత పనులను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి మ్యాన్ హోల్ లో పూడిక తీత పనులను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శ్రీనివాస కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలో పర్యటించానని , కాలనీ లో నెలకొన్న డ్రైనేజి సమస్యను పరిష్కరించడానికి బకెట్ క్లినింగ్ చేపట్టినట్లు తెలిపారు. మ్యాన్ హోల్ నుండి ప్రతి మ్యాన్ హోల్ వరకు బకెట్ క్లినింగ్ ద్వారా మ్యాన్ హోల్ లో పేరుకుపోయిన పూడికను తొలగించారని తెలిపారు. అంతేకాక కాలనీలలో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బకెట్ క్లినింగ్ ద్వారా డ్రైనేజి సమస్య పరిష్కరించడం పట్ల ప్రభుత్వ విప్ గాంధీకి, కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుకు కాలనీవాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి DGM వేంకటేశ్వర్లు, మేనేజర్ ప్రశాంతి, సూపర్ వైజర్ నరేంద్ర, హైదర్ నగర్ డివిజన్ బీఆర్ ఎస్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వేణు గోపాల్, నవీన్, సతీష్, శ్రీనివాస్ రాజు, విజయ్, రమేష్, సాయిలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

బకెట్ క్లీనింగ్ తో చేపడుతున్న పూడిక తీత పనులను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here