నమస్తే శేరిలింగంపల్లి : జాతీయ రహదారితోపాటు అంతర్గత రహదారులపై ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగని రీతిలో చర్యలు చేపట్టాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి ఆదేశించారు. ప్రధాన రహదారులు అంతర్గత రహదారుల పైకి ఆక్రమించి చేపట్టే నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని చందానగర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలో ..జోనల్ కమిషనర్ మంగళవారం ఉదయం పలు విభాగాల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా చందానగర్ సర్కిల్ పరిధిలో పీజేఆర్ ఎంక్లేవ్, అపర్ణ రోడ్లను పరిశీలించారు. అనంతరం లింగంపల్లి మార్కెట్ పరిసరాలను తనిఖీ చేశారు.
అనంతరం బొటానికల్ గార్డెన్ వద్ద పర్యటించి పరిసరాలను పరిశీలించి పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాలనీలలో అంతర్గత రహదారులను ఆక్రమించి చేపట్టే నిర్మాణాలను.. రహదారుల పైకి వచ్చిన ఫుట్ పాత్ లను తొలగించాలని ఆదేశించారు. రహదారులకు ఇరువైపులా పేరుకుపోతున్న చెత్త …గ్రీన్ వేస్టేజ్ ని వెంటనే తొలగించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన డివైడర్ల ఏర్పాట్లను పరిశీలించాలని రహదారులపై ఏర్పడ్డ గుంతలను తక్షణమే పూడ్చివేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
రోజువారి పారిశుద్ధ్య పనుల లో మరింత పురోగతి నెలకొనాలని జాతీయ రహదారులపై పారిశుద్ధ్య చర్యలను మరింత పెంచాలని జోనల్ కమిషనర్ సూచించారు. బొటానికల్ గార్డెన్ ఎదురుగా ఉన్న గుడిసెలను తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు . నానాటికి పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా ..రహదారులు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. జోనల్ కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి, పట్టణ ప్రణాళిక విభాగం ఏసీపీలు మెహర, గణపతి ,వైద్యాధికారి డాక్టర్ కార్తీక్, ఇంజనీరింగ్ డీ ఈ దుర్గాప్రసాద్, మహేష్, పారిశుధ్య విభాగం ఎస్ఆర్పీలు ఎస్ ఎఫ్ ఎల్ ఉన్నారు.