- పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్యే గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ గంగారం గ్రామంలో అమ్మవారి జాతర ఉత్సవాలు వేడుకగా జరిగాయి. తెలంగాణ అమ్మవారి బోనాలు, బోనాల పండుగ సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గంగారం పోచమ్మ తల్లి ఫలహారం, తొట్టెలు కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు కంది జ్ఞానేశ్వర్ వారిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.