- శేరిలింగంపల్లి నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి – ముద్ర టియుడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నూతన ప్రెస్ క్లబ్ కమిటీ శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు కొండ విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా గుర్రాల తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షులుగా డి.శ్రీనివాస్, ప్రణయ్, అశోక్ యాదవ్, కోశాధికారి వరుణ్, జాయింట్ సెక్రటరీలుగా సాద నరేష్, గోవర్ధన్ రెడ్డి, ప్రవీణ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా మల్లేష్, శంకర్, నాగరత్నం, ఎండి యాసిన్, రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడతామన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి జర్నలిస్టులు పాల్గొన్నారు.