నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎండి ముషారఫ్ ఉల్ హమీద్ నియమితులయ్యారు. ఈ సందర్బంగా ముషారఫ్ ఉల్ హమీద్ కు ఆ పార్టీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు.
తనకు ఈ పదవి వచ్చేందుకు కృషి చేసిన పిసిసి డెలిగేట్ సత్యం రావు, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవికాంత్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మైపాల్ యాదవ్ , శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్య రాజన్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే ముషారఫ్ తండ్రి ఎం.డీ. హమీద్ మియా 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మాజీ పిసిసి కార్యదర్శి, అతని తల్లి అజ్మత్ సుల్తానా హమీద్, సర్వే నెం.80 మొదటి కౌన్సిలర్ కూడా. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు.