సొంతింటి కల సాకారమైన వేళ..

  • 500 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పత్రాలు పంపిణి చేసిన మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: పేదవారి సొంత ఇంటి కల నెరవేరింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో 500 మంది లబ్ధిదారులకు ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇళ్ల పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని మాట్లాడారు.

పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎంతో పారదర్శకంగా ఎంపికైన అర్హులైన 500 మంది లబ్దిదారులకు ఇండ్ల పత్రాలను అందించడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన బృహత్తర పథకమే డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకమని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు దశల వారిగా అందజేయనున్నట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉండేలా చూసి నిజమైన లబ్ధిదారులకు అవకాశం కలిపించి ఇండ్లు కేటాయించినట్లు చెప్పారు.


అయితే డబుల్ ఇండ్ల సముదాయంలో ఆసుపత్రి, పాఠశాల , అంగన్ వాడి , దేవాలయం, చర్చి, మసీదు వంటి ప్రార్థన మందిరాలను నిర్మించాలని , రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ బస్ లను ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావుని కోరగా.. దీనికి స్పందించిన మంత్రి హరీష్ రావు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here