- బీజేపీ అసెంబ్లీ స్థాయి సమావేశంలో కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు
నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్, మియాపూర్ బిజెపి కార్యాలయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా కర్ణాటక రాష్ట్ర బీజేపీ శాసన సభ్యులు మునిరత్నం నాయుడు విచ్చేసి రాబోయే ఎన్నికల కార్యాచరణను కార్యకర్తలకు మార్గదర్శకం చేశారు. ఈ సందర్బంగా మునిరత్నం నాయుడు మాట్లాడుతూ ఎన్నికల సమయం దగ్గరికి వస్తున్న తరుణంలో ప్రతీ కార్యకర్త, అహర్నిశలు పార్టీ గెలుపునకు కృషి చేయాలని, ఎన్నికల సమయం సందర్భంగా అందరు రెట్టింపు ఉత్సాహంతో పని చేసి శేరిలింగంపల్లిలో బీజేపీ జెండా ఎగురవేయాలని దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్బంగా శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే యోగానంద్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని దృడమైన సంకల్పం నిబద్ధతతో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్యకర్తలందరికీ అభినందనలు తెలుపుతూ, కార్యకర్తలందరు పార్టీ ఆదేశాలకు కట్టుబడి, నిరంతరం ప్రజలలో ఉంటూ బీజేపీ పార్టీ బలోపేతానికి, గెలుపుకు కృషి చేయాలనీ పిలుపు నిచ్చారు.
జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చిన ఒక కార్యకర్తలా పనిచేస్తామని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కచ్చితంగా బీజేపీ జెండా ఎగురవేస్తామని యోగానంద్ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మరియు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.