నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీనిధి గ్లోబల్ పాఠశాలలో గురువారం బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు సంప్రదాయ వస్త్రాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి విద్యార్థులు , ఉపాధ్యాయులు ఆడిపాడారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ నల్లపాటి వెంకటేశ్వర్ రావు, ప్రిన్సిపల్ క్రాంతి, ప్రధానోపాధ్యాయులు భవాని, రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.