శాసనసభలో ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: మెరుగైన జీవన ప్రమాణాల కోసం, ట్రాఫిక్ రహిత సమాజం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ లో వ్యూహాత్మక రహదార్ల అభివృద్ధి కార్యక్రమం (SRDP ) పై శాసన సభలో జరిగిన చర్చలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రసంగించారు. ప్రజా సౌకర్యార్థం మియాపూర్ చౌరస్తా నుండి BHEL చౌరస్తా వరకు పూణే నమూనా ప్రకారం మెట్రో మార్గం, ఫ్లై ఓవర్ ను ఒకే పిల్లర్ మీదుగా వచ్చే విధంగా నూతనంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
హైదరాబాద్ లో వ్యూహాత్మక రహదార్ల అభివృద్ధి కార్యక్రమం (SRDP ) పై శాసన సభలో మాట్లాడటానికి అవకాశం కలిపించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మియాపూర్ చౌరస్తా నుండి BHEL చౌరస్తా వరకు పూణే నమూనా ప్రకారం మెట్రో మార్గం, ఫ్లై ఓవర్ ను ఒకే పిల్లర్ మీదుగా వచ్చే విధంగా నూతనంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ఈ రోడ్డు మీద మియాపూర్ చౌరస్తా, ఆల్విన్ చౌరస్తా ల మీదుగా నిత్యం రోజు వారిగా లక్ష కు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడానికి రెండు చౌరస్తాల మీదుగా BHEL వరకు ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాలని, ఈ విధానం ద్వారా నిర్మాణం సాఫీగా జరుగుతుందని తెలిపారు. స్థలం సేకరణ, భవనాల తొలగింపు వంటి ఇతర అంశాలు అవసరం ఉండదని తక్కువ ఖర్చుతో త్వరితగతిన నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ ఫ్లై ఓవర్ నిర్మాణం ఎప్పుడు పూర్తి చేసే సమయం తెలపాలని, మియాపూర్ బొల్లారం చౌరస్తా నుండి గండి మైసమ్మ వరకు చేపడుతున్న 200 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, JNTU నుండి ప్రగతి నగర్ వరకు రోడ్డు విస్తరణ మరియు , ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజులరామరం వరకు చేపడుతున్న 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని పేర్కొన్నారు.
దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 2వ దశ SRDP పనులు త్వరలోనే ఆమోదం చేయబోతున్నామని, రూ. 4,305 కోట్ల ఖర్చు తో చేపడుతామని, ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు ఆగస్టు లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, మియాపూర్ చౌరస్తా, ఆల్విన్ చౌరస్తా మీదుగా BHEL వరకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణం కు కృషి చేస్తామని, పూణే నమూనా ప్రకారం మెట్రో మార్గం మరియు ఫ్లై ఓవర్ ను ఒకే పిల్లర్ మీదుగా వచ్చే విధంగా నూతనంగా నిర్మాణం చేపట్టే విధంగా పరిశీలిస్తామని తెలిపారు.