శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం

  • బిఆర్ఎస్ పాలనలో గుడిసెలలో బతుకుతున్న పేదలు రోడ్డుపై ..
  • డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని మాయ మాటలు
  • ఒక్క ఇంటిని ఇవ్వని వైనం
  • ‘ప్రజా గోస – బీజేపీ భరోసా ‘ కార్నర్ మీటింగ్ లో బీజేపీ జాతీయ నాయకుడు, మధ్యప్రదేశ్ ప్రభారీ మురళీధర్ రావు, బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
శేరిలింగంపల్లి డివిజన్, గోపి నగర్ హనుమాన్ ఆలయం వద్ద నిర్వహించిన ప్రజా గోస – బీజేపీ భరోసా, కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న.. బీజేపీ జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్ ప్రభారీ మురళీధర్ రావు, బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు శేరిలింగంపల్లి డివిజన్, గోపినగర్ లో 78, 79, 81 బూత్ ల శక్తి కేంద్ర ఇంచార్జ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గోపి నగర్ హనుమాన్ టెంపుల్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో జాతీయ నాయకుడు, మధ్యప్రదేశ్ ప్రభారి మురళీధర్ రావు, బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్రరావు , రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, కంటెస్టెడ్ కార్పొరేటర్ కర్చర్ల ఎల్లేష్, డివిజన్ అధ్యక్షుడు రాజు శెట్టి, బూత్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, చంద్రమోహన్, సత్య కూర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని, గడిచిన 9 ఏళ్ల పాలనలో బిఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఒరగబెట్టిందేమిలేదని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఒక్క ఇంటిని కూడా ఎవరికి కేటాయించకుండా గుడిసెలలో బతుకుతున్న పేదవారిని రోడ్డున పడేశారని అన్నారు.

కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ నాయకుడు, మధ్యప్రదేశ్ ప్రభారీ మురళీధర్ రావు

చెరువుల సుందరీకరణ పేరుతో ఎమ్మెల్యే వారి అనుచరులు కబ్జాలు చేస్తున్నారని, నాలా విస్తరణకు రూ. 132 కోట్లు కేటాయించామని చెప్పారు. ఏ నాలా విస్తరణ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత బందు వాళ్ళ అనుకూల నాయకులకు మాత్రమే కేటాయించారన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు, యువతకు నిరుద్యోగ భృతి, అధిక కరెంట్ చార్జీలు, అధిక బస్ చార్జీలు, 1 రూపాయికి నల్ల కనెక్షన్ ఇస్తామని, ఇప్పుడు అధిక నల్లా బిల్లులు ఎలా ఎన్నో రకాలుగా ప్రజలను మోసం చేస్తూ, మాయమాటలు చెబుతూ పబ్బం గడుపుతున్నారని ఇక మీ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని , మీ అవినీతి, కుటుంబ, రాచరిక పాలనను అంతం చేసేందుకే భారతీయ జనతా పార్టీ ప్రతి శక్తి కేంద్ర పరిధిలో కార్నర్ మీటింగ్ లు పెట్టిందన్నారు. మీ అవినీతి పాలన ప్రజలకు క్షుణ్ణంగా వివరించి అర్థమయ్యేలా తెలియజేస్తామన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, వివిధ మోర్చల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమానికి హాజరైన ప్రజలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here