నమస్తే శేరిలింగంపల్లి: ఆస్తుల క్రమబద్దీకరణ, భవన నిర్మాణ పనులకు త్వరితగతిన పూర్తి అయ్యేలా ఆదేశాలివ్వాలని కోరుతూ.. రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలనా కమిషనర్ (సీసీఎల్‌ఏ) నవీన్ మిట్టల్ ని మర్యాదపూర్వకంగా కలిశారు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆయనను కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని భూవివాదాలకు సంబందించిన పలు సమస్యలను తీసుకెళ్లారు, ప్రభుత్వం తరపున పరిష్కార మార్గాలను చూడవాల్సిందిగా కోరారు.

రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలనా కమిషనర్ (సీసీఎల్‌ఏ) నవీన్ మిట్టల్ ని కలిసిన ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
ముఖ్యంగా కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ లో 59 GO ద్వారా క్రమబద్దీకరణకు అధిక డబ్బులు చెల్లించాల్సిందిగా రెవెన్యూ అధికారులు తెలపడంతో పక్కనే ఉన్న A బ్లాక్ కన్నB & సి బ్లాక్ వాసులు అధికమొత్తం లో చెల్లించాల్సి వస్తుండడంతో ఉన్న వ్యత్యాసాన్ని పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రామ్ నరేష్ నగర్ కాలనీ వాసులు ఆస్తుల రిజిస్ట్రేషన్ శాఖ తెలుపుతున్న అభ్యంతరాలను పరిష్కరించాలని, నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో ULC ద్వారా డబ్బులు చెల్లించి కూడా వారి స్థలాలను క్రమబద్దీకరించకపోవడం లాంటి పలు సమస్యలను GO . 58 & 59 ద్వారా దరఖాస్తులు చేసుకున్న పేద వారి ఆస్తుల క్రమ బద్దీకరణను త్వరిత గతిన పూర్తి చేయడానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరినట్లు ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేటాయించిన 2 ఎకరాల స్థలము లో భవనం నిర్మాణానికి, నిధులు మంజూరు చేయుటకు ముఖ్య మంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నందున రూ. 9 కోట్ల నిధుల మంజూరుకి సహకరించి,, నిధుల మంజూరు చేయాలనీ, భవణ నిర్మాణంను త్వరితగతిన చేపట్టడానికి అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వవలసిందిగా ఆయనను కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన నవీన్ మిట్టల్ పై అంశాల పై తగు చర్యలు తీసుకుంటటానని చెప్పారు.