- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు క్షీరాభిషేకం
నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024 లో జీహెచ్ఎంసి హైదరాబాద్ నగర అభివృద్ధికి నిధులు కేటాయింపుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ క్షీరాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉందని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పక్క ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగానే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం హైదరాబాద్ మరింత ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నామనే సంకేతాన్ని ప్రభుత్వం నిజంచేసిందన్నారు.
ప్రజలకు అభివృద్ధిని మరింత చేరువ చేసేందుకు, సిటీ అభివృద్ధి మరింత వేగంగా జరిగేందుకు కేటాయించిన బడ్జెట్ వివరాలు వెల్లడించారు.
★రూ.10వేల కోట్లు
★మౌళికవసతులకు రూ.3,065 కోట్లు
★హెచ్ఎండిఏకు రూ.500కోట్లు..
★మెట్రో విస్తరణకు రూ.600కోట్లా భారీ నిధులు కేటాయించిందని అన్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రతి గడపకు వెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం చూపుతామని, నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీ/బస్తీలో అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేల అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.