- కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాషా
- సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎనక్లేవ్ కాలనీ కి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాషా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చకున్నారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ యువత చూపు కాంగ్రెస్ వైపే ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలన చూసి ఆకర్షితులై చాలా మంది బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కలిపిస్తామని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయలని, ఒక వారధిగా పని చేయాలని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.
ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు సైనికుడిగా పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు, అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మోహన్ ముదిరాజు, గంగాధర్, మహేందర్, గిరి, శ్రీధర్ పాల్గొన్నారు.