మాతశ్రీనగర్ లో మారని తీరు… సెప్టిక్ ట్యాంక్ స్థలంలో మళ్లీ నిర్మాణ పనులు..

  • సర్వే నెంబర్ 54లో మూడు ప్లాట్స్ లో తరచూ తలెత్తుతున్న వివాదం
  • సెప్టిక్ ట్యాంక్ కోసం స్థలం కేటాయించగా.. అపార్ట్ మెంట్ నిర్మాణం కోసం ప్రయత్నం
  • ప్లాట్ 1117లోని సెప్టిక్ ట్యాంక్ స్థలంలో మట్టితో చదును చేసి గోడ కట్టిన ఈసీ సభ్యులు
  • జిహెచ్ ఎంసీ దృష్టికి తీసుకెళ్లిన కాలనీ వాసులు
  • ఐదు అంతస్తుల భవనానికి అనుమతి తీసుకోవడం మరో విశేషం
సెప్టిక్ ట్యాంక్ ను జెసిబి సహాయంతో మట్టితో పూడ్చి వేస్తున్న దృశ్యం

నమస్తే శేరిలింగంపల్లి: సెప్టిక్ ట్యాంక్ కోసం కేటాయించిన స్థలంలో అపార్ట్ మెంట్ నిర్మాణాలు చేపడుతూ కాలనీ వాసులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే మళ్ళీ మాతృశ్రీ నగర్ కాలనిలో అదే సర్వ్ నంబర్ లో చోటు చేసుకున్నది. ఈ విషయాన్ని కాలనీ వాసులు జిహెచ్ ఎంసీ జోనల్ కమీషనర్, సిపి దృష్టికి తీసుకెళ్ల డంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. వివరాలు.. మాతృశ్రీ నగర్ లే అవుట్ వేసినప్పుడు డ్రైనేజీ అవసరాల దృష్ట్యా సర్వే నెంబర్ 54లో మూడు ప్లాట్స్ (1117, 1118, 1119) ను సెప్టిక్ ట్యాంక్ కింద మార్క్ చేశారు. ప్రస్తుతం ఆయా ప్లాట్స్ లో భౌతికంగా సెప్టిక్ ట్యాంక్ ఉంది. అయితే గత ఏడాది కాలనీలో సెంట్రల్ డ్రైనేజీ ఏర్పాటు చేసి సెప్టిక్ ట్యాంక్ ని డిస్ కనెక్ట్ చేసారు. ఇదే అదును చేసుకుని కాలనీ అసోసియేషన్లోని కొందరు మాతృశ్రీ హౌసింగ్ కోఆపరేటివ్ వద్ద ఈసీ సభ్యులుగా చేరి గత సంవత్సరం ఆ స్థలాన్ని ప్రయివేట్ వ్యక్తులకు అమ్మారు. ఈ విషయాన్నీ కాలనీ వాసుల పత్రికల దృష్టికి తీసుకెళ్లగా ప్లాట్ 1119 రిజిస్ట్రేషన్ రద్దు చేసారు. తాజాగా ప్లాట్ 1117 వద్ద సెప్టిక్ ట్యాంకుని కొంత పగల కొట్టి పూడ్చివేసే ప్రయత్నం చేస్తుండగా.. కాలనీ వాసులు స్పందించి జిహెచ్ ఎంసీ దృష్టికి తీసుకెళ్లి పనులు నిలిపివేయించారు.
విశేషమేటంటే సదరు స్థలంలో అయిదు అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతి కూడా తీసుకోవడం గమనార్హం.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here