- కొండాపూర్ డివిజన్ లో ప్రజలతో ముఖాముఖి 100 రోజులు కార్యక్రమం
- సమస్యలు పరిష్కరించాలని అధికారులకు విన్నవించిన కాలనీవాసులు

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ హనీఫ్ కాలనీలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంబంధిత అధికారులు హనీఫ్ కాలనీలో వీధి, వీధి పర్యటించి ప్రజలను కలసి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్బంగా జీహెచ్ఎంసి, వాటర్ బోర్డు, ఎంటమాలజీ , శానిటేషన్, ఆరోగ్య శాఖ, ఎలక్ట్రిసిటీ శాఖ అధికారులకు హనీఫ్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. హనీఫ్ కాలనీలో చాలా వీధులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, సీసీ రోడ్లు దాదాపుగా పూర్తి అయ్యాయని, మిగిలిన 5,6,7 వీధులలో పాత డ్రైనేజీ పనులను పూర్తి చేసి, రోడ్లు వేయాలని కోరారు. ఎలక్ట్రికల్ స్తంభాలు దాదాపుగా ఉన్నా కూడా, కొన్ని చోట్ల అవసరం ఉందని, దానితో బాటుగా 3 ఫేజ్ లైన్లు వేయాలని తెలిపారు. అధికారులు గడప గడపకు తిరిగి సమస్యలు తెలుసుకోవటం పట్ల హనీఫ్ కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ డీఈ రమేష్, వర్క్ ఇన్ స్పెక్టర్ వినోద్, వాటర్ బోర్డు మేనేజర్ సందీప్, ఇన్ ఛార్జ్ శ్రీకాంత్, శానిటేషన్ ఎస్ఎఫ్ఏ నంద కుమార్, ఎంటమాలజీ సూపర్ వైజర్ అబ్దుల్ సత్తార్, మొహ్మద్ జాఫర్, ఏంఏ సమద్, తోట సురేష్, పాండు రంగా, శ్రీనివాస్ రెడ్డి, లాయిక్ ఉద్దీన్, ముక్తార్, రాములు, నిల్సన్ అబ్దుల్ అజిజ్ పాల్గొన్నారు.