నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ ఇందిరానగర్ లో రంజాన్ పండుగ సందర్భంగా మంగళవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ముస్లిం మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులను ఖర్జూర పండు తినిపించి ఉపవాసం విడిపించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విందులో ముస్లిం సోదరులకు స్వయంగా వడ్డించారు. రాబోయే రంజాన్ పండుగను ముస్లింలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, గచ్చిబౌలి విలేజ్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ సయ్యద్ నయీమ్, మహమూద్, సయ్యద్ అజ్జు, మొహమ్మద్ చోటు, అబ్దుల్ సత్తార్, యూసుఫ్, షఫీర్ అహ్మద్, అఫ్జల్, షా నవాజ్, ఇబ్రహీం, ఖాసీం, షఫీ పాల్గొన్నారు.
