- రూ. 20 లక్షల అంచనా వ్యయంతో అదనపు గదుల నిర్మాణం
- సభలు, సమావేశాల నిర్వహణకు వీలుగా నిర్మితమైంది
- ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ.
నమస్తే శేరిలింగంపల్లి: భారతినగర్ డివిజన్ పరిధి లోని ఎం.ఐ.జి కాలనీ లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఎమ్మెల్యే సీడీపీ నిధుల నుండి, కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి సొంత నిధులతో సుమారుగా రూ.20 లక్షల అంచనావ్యయం తో సీనియర్ సిటిజెన్ భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి , స్థానిక సీనియర్ సిటిజన్ల తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ భవనంలో ఎం.ఎల్.ఏ సి.డి.పి నిధులతో పాటు కార్పొరేటర్ సొంత నిధులతో అదనపు గదుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. సీనియర్ సిటీజన్ భవనాన్ని ప్రారంభించడం సంతోశంగా ఉందని, ఇక్కడి ప్రాంత వాసులకు సమావేశాలు, సభలు, నిర్వహించుకునేందుకు వీలుగా అదనపు గదుల నిర్మాణం జరిగిందన్నారు. కాలక్షేపం కోసం సేద తీరేందుకు, ఇండోర్ గేమ్స్ ఏర్పాటు చేశారని, MIG అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధమని, ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ ప్రజలకు సూచించారు. అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. సీనియర్ సిటిజన్ భవనం నిర్మాణం కు నిధులు కేటాయించి సహాకరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీకి కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో GHMC ఈ ఈ శ్రీనివాస్, DE రమేష్, AE రమేష్, హెచ్ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి జి ఎం రాజశేఖర్, మేనేజర్ సుబ్రమణ్యం, మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, నాగమణి, MIG తెరాస అధ్యక్షుడు భాస్కర్ , తెరాస సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు రాధాకృష్ణ, సత్యనారాయణ, నర్సింహ రావు, సుబ్బారావు, నాగేశ్వర్ రావు, సురేంద్ర, ఐ.వి.రాజు, కాలనీ అద్యక్షుడు బాలయ్య, డైరెక్టర్ సత్యనారయణ, సుబ్బా రావు, కరుణాకర్, ముదిరాజ్, సంపత్ గౌడ్, రాజు, మహిళ అధ్యక్షురాలు జ్యోతి, అనిత, సంధ్య, లక్ష్మీ, స్వర్ణ లత, సురేందర్, నరేందర్ పాల్గొన్నారు.