నమస్తే శేరిలింగంపల్లి: గోపినగర్ లో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. చిన్నారులు, యువతులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి, బతుకమ్మ పాటలతో పాటు, కోలాటం, దాండియా నృత్యాలతో ఆకట్టుకున్నారు. అనంతరం సామూహికంగ తరళివెళ్లి గోపి చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. బతుకమ్మ వెంట తీసుకెళ్లిన సద్దులను పరస్పరం మార్చుకొని ఆరగించారు. ప్రతి ఇంటా ప్రజలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సుఖసంతోషాలు ప్రసాదించాలని పసుపు గౌరమ్మను వేడుకున్న టు మహిళలు తెలిపారు.