- హుడా కాలనీ ఫేస్ 2 లో జయంతి వేడుకల్లో పాల్గొని పూజలు
నమస్తే శేరిలింగంపల్లి : దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకులు, బంజారా/లంబాడాల ఆరాధ్యదైవం సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ అని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ 285 వ జయంతి సందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ ఫేస్ 2 లో జరిగిన వేడుకలలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఆ మహనీయుడు చూపిన ఆదర్శమార్గంలో మానవ శ్రేయస్సు కోసం మనందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
భారత సంస్కృతి సంప్రదాయాలను కాపాడిన మహనీయులు సేవాలాల్ మహరాజ్ అని, దేశం పట్ల ధర్మం పట్ల ఆయన ఎన్నో సేవలుచేసారని పేర్కొన్నారు. దేశంకోసం, హిందు ధర్మంకోసం, ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ నాయక్, అంజద్ పాషా, మున్య నాయక్, గోపాల్ నాయక్, సుభాష్ నాయక్, అమర్ సింగ్ నాయక్, వెంకట్ రావు నాయక్, బాషా నాయక్, సురేష్ రాథోడ్,, శివ , నరేష్, కాలనీ వాసులు పాల్గొన్నారు.