హైకోర్టు ఆదేశాలతో విస్తృతంగా చెరువుల సందర్శన

  • 12న జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో లెర్డ్న్ అడ్వకేట్ కమీషనర్ల సంయుక్త సమావేశం
  • శేరిలింగంపల్లి మండలంలోని చెరువులను సందర్శించి వివరాల సేకరణ
  • పాల్గొన్న ఆయా శాఖల అధికారులు
  • 16న మరిన్ని చెరువులలో లెర్డ్న్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రవీణ్ కుమార్, ప్రభుత్వ ప్లీడర్ టి.శ్రీకాంత్ రెడ్డిల పర్యటన

నమస్తే శేరిలింగంపల్లి : హైకోర్టు ఆదేశాల మేరకు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలోని చెరువులను జి. ప్రవీణ్ కుమార్ లెర్డ్న్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, రెవెన్యూ ప్రభుత్వ ప్లీడర్ టి.శ్రీకాంత్ రెడ్డి సందర్శించారు. చెరువుల ప్రస్తుత స్థితిని తెలుసుకుని జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించి వాటి వివరాలను సేకరించారు.

జి. ప్రవీణ్ కుమార్ లెర్డ్న్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, రెవెన్యూ ప్రభుత్వ ప్లీడర్ టి.శ్రీకాంత్ రెడ్డిలతో..

అయితే చెరువుల స్థితిగతుల నివేదిక కోసం ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకాంతిలు ఈ నెల 6వ తేదీన ఆర్డర్ జారీ చేసి హైకోర్టు అడ్వకేట్ కమిషనర్లను నియమించి ఆ బాధ్యతను వారికి అప్పగించింది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలోని మొత్తం 16 చెరువులను పరిశీలించి వాటి నివేదికను రెండు మూడు వారాల్లో సీల్డ్ కవర్ లో సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు 12వ తేదీన జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ & రెవెన్యూ అధికారులతో లెర్న్డ్ అడ్వకేట్ కమీషనర్లు సంయుక్త సమావేశం నిర్వహించారు. 15, 16 తేదీల్లో 16 చెరువులను సందర్శించేందుకు ప్రణాళికలు రచించారు.

చెరువులను సందర్శించి వివరాలను తెలుసుకుంటున్న దృశ్యం

అనంతరం 15వ తేదీన లెర్డ్న్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, రెవెన్యూ ప్రభుత్వ ప్లీడర్ టి. శ్రీకాంత్ రెడ్డి మాదాపూర్ లోని దుర్గం చెరువు, గుట్టల బేగంపేట్ లోని సున్నం చెరువు, నానక్ రాంగూడలోని మేడికుంట, గౌలిదొడ్డిలోని గోసాయికుంట, నల్లగండ్లలోని పెద్ద చెరువు, చందానగర్ లోని గంగారం పెద్ద చెరువులను సందర్శించి వాటి వివరాలను సేకరించారు. 16వ తేదీన మరిన్ని చెరువులను సందర్శించనున్నారు.

ఈ సందర్శనలో రంగారెడ్డి జిల్లా సర్వే & ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, రంగారెడ్డి జిల్లా భూ పరిరక్షణ, కలెక్టరేట్ తహశీల్దార్ డి. శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం తహశీల్దార్ రాములు, రాజేంద్రనగర్ డివిజన్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే వెంకటేష్, శేరిలింగంపల్లి మండలం నాయబ్ తహశీల్దార్ జి.శంకర్, శేరిలింగంపల్లి మండలం సర్వేయర్ ఎస్.మహేష్, శేరిలింగంపల్లి మండలం గిర్దావర్లు శ్రీను, రాంబాబు, నీటిపారుదల & జీహెచ్ఎంసీ శాఖ సిబ్బంది, హైదరాబాద్ జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ శివ కుమార్ నాయుడు, ఐఏఎస్, (లేక్స్), సూపరింటెండెంట్ ఇంజనీర్, నీటిపారుదల శాఖ ఆనంద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నార్త్ ట్యాంక్ డివిజన్, నీటిపారుదల శాఖ నారాయణ, చందానగర్ సర్కిల్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నార్త్ ట్యాంక్ డివిజన్, నీటిపారుదల శాఖ నళిని, నాగరాజు, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ & డిజాస్టర్ మేనేజ్‌మెంట్, జీహెచ్ఎంసీ సీఐ బాల్ రెడ్డితో పాటు మాదాపూర్, గచ్చిబౌలి, చందానగర్ పోలీసుల బృందం వారి వారి పరిధిల్లో చేపట్టిన సందర్శనలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here