- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ పాల్గొని పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ గిరిజనుల కోసం పోరాడిన ధీరుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు.
గిరిజనులు ఆర్ధికంగా, రాజకీయంగా ఎదుగుదలకు, అభున్నతి కోసం కృషి చేస్తున్నది, కృషి చేసేది భారతీయ జనతా పార్టీ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రవి నాయక్, రాయుడు, దశరథ్ నాయక్, గణేష్ నాయక్, రాజు నాయక్, ప్రమోద్ నాయక్, సురేష్ నాయక్, విఠల్ నాయక్, శంకర్ నాయక్, శంకర్, అనిల్ నాయక్, బాలరాజు, స్థానిక కాలనీ వాసులు, ప్రజలు పాల్గొన్నారు.