- నడిగడ్డ తండా లో జయంతి వేడుకల్లో పాల్గొని పూజలు
నమస్తే శేరిలింగంపల్లి : దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకులు, బంజారా/లంబాడాల ఆరాధ్యదైవం సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండా లో వేడుకగా నిర్వహించారు. ఈ వేడుకలలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే గాంధీ పాల్గొని సంత్ సేవాలాల్ సేవలను కొనియాడారు.
దేశం పట్ల ధర్మం పట్ల ఆయన ఎన్నో సేవలుచేసారని పేర్కొన్నారు. దేశంకోసం, హిందు ధర్మంకోసం, ఆయన చేసిన సేవలను కొనియాడారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున, అత్యంత ఖరీదైన ప్రాంతంలో సంత్ సేవాలాల్ మహారాజ్ పేరుతోనే బంజారా భవన్ ను వారి ఆత్మగౌరవం ఉట్టిపడేలా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో నిర్మించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్వామి నాయక్, తిరుపతి నాయక్, హన్మంతు నాయక్, సీతారాం నాయక్, తుకారాం నాయక్, దశరత్ నాయక్ గోపి నాయక్,లక్ష్మణ్ నాయక్, కృష్ణ నాయక్, చందు నాయక్, జితేందర్ నాయక్, హరి నాయక్, ఈశ్వర్, శ్రీను నాయక్, కృష్ణ నాయక్,సుధాకర్, కమలాకర్, ఈశ్వర్, బాలు నాయక్, కాలనీ వాసులు పాల్గొన్నారు.