నమస్తే శేరిలింగంపల్లి : ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన బాలలు అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఓ వ్యక్తి విలేజ్ యూత్ హౌస్ (ఎస్ఓఎస్ చిల్డ్రన్స్) శాఖ నడుపుతున్నారు. అయితే తన కుమారులు యు. రాజేష్ (17) 9వ తరగతి, బి. జగన్ (14) 8వ తరగతి చదువుతున్నారు. భేల్ లోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్నారు. రోజూ పాఠశాలకు వెళ్లి ఆల్యమైన ఇంటికి తిరిగి వచ్చేవారు. కానీ 13వ తేదీన ప్రతిరోజూ లాగే ఇంటి నుంచి పాఠశాలలకు వెళ్లారు. కానీ తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన వారి తండ్రి పాఠశాలలో తెలుసుకోగా రాలేదని తెలిసింది.
దీంతో చుట్టుపక్కల, అన్ని ప్రాంతాల్లో వెతికారు. స్నేహితుల వద్ద ఆచూకీ కోసం ఆరా తీసినా ఫలితం లభించలేదు. దీంతో చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పిల్లలు ఇంటినుంచి వెళ్లేటప్పడు స్కూల్ యూనిఫాంలో ఉన్నారని, వారి ఎత్తు సుమారు 5.7 అడుగులు, తెలుగు హిందీ, ఆంగ్ల భాషలు మాట్లాడగలరని.. ఎవరికైనా తెలిస్తే సమాచారం అందించగలరని పోలీసులు తెలిపారు.