- పత్రిక నగర్ లో రూ. 2 కోట్లతో సైన్స్ థీమ్ పార్కు ను ప్రారంభించిన ఎమ్మెల్యే
నమస్తే శేరిలింగంపల్లి: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూతన పార్కులు ఏర్పాటు, పాత పార్కుల నూతన నవీనకరణతో పచ్చని పార్కులు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నా యని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని పత్రిక నగర్ లో 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటైన సైన్స్ థీమ్ పార్కు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ థీమ్ పార్క్ ను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కోమిరిశెట్టి సాయిబాబా, స్థానిక నాయకులతో కలసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ప్రారంభోత్సవం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రంధాలయం డైరెక్టర్ నీరుడి గణేష్ ముదిరాజ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా, రాజు యాదవ్, శ్రవణ్ యాదవ్, కుమ్మరి సిల్వర్ శ్రీనివాస్, తిరుపతి యాదవ్, తిరుమల రెడ్డి, రఘురామ్ రెడ్డి, వెంకటేశ్వర రావు, ఫరీష్, రాజా రెడ్డి, వెంకట్, ప్రసాద్ పాల్గొన్నారు.