నమస్తే శేరిలింగంపల్లి: మొబైల్ ఫోన్ల మిస్సింగ్ కేసులో రాయదుర్గం పోలీసులు పురోగతి సాధించారు. బాధితులు పొగోట్టుకున్న మొబైల్ ఫోన్లను రీకవరీ చేసి వారికి అందించారు. పర్సనల్ సమాచారం, జ్ఞాపకాలు, ఎన్నో మొబైల్ లో ఉంటాయని సెల్ ఫోన్లు రికవరీ చేసి అందించడం పట్ల బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని రాయదుర్గం ఎసిపి పి శ్రీనివాస్, మాదాపూర్ ఏసిపి ఎం మహేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే చంద్రశేఖర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విజయవర్ధన్, అడ్మిన్ ఇన్స్పెక్టర్ మాదాపూర్ జోన్ పాల్గొన్నారు.