- రూ. 3 కోట్ల 95 లక్షలతో నిర్మాణం
- ప్రారంభించిన చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: పేదలకు అందుబాటులో ఉండేలా సకల సౌకర్యాలతో సేవలందించేందుకు మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మితమయ్యాయని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి తెలిపారు.
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి తండా లో రూ3 కోట్ల 95 లక్షల అంచనా వ్యయం తో నూతనంగా నిర్మించిన మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ ను కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ సాయి బాబా , GHMC అధికారులతో కలిసి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు అందరికి అందుబాటులో ఉండే విధంగా , అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో నిర్మించినట్లు తెలిపారు.
కాలనీ అభివృద్ధి, సమస్యల పై చర్చించుకోవడానికి చిన్న చిన్న సమావేశాలు, బర్త్ డే పార్టీలు , వివాహాలు, పొదుపు సమాఖ్య మహిళా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా భవనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఎస్ ఈ శంకర్ నాయక్, ఈఈ శ్రీనివాస్, ఏ ఈ సునీల్, వర్క్ ఇన్ స్పెక్టర్ మహేష్ , మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.