మారబోయిన సత్యనారాయణ యాదవ్ కు ఘన నివాళి

  • నివాళులర్పించిన రవికుమార్ యాదవ్
మారబోయిన సత్యనారాయణకు నివాళులర్పిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: మసీదు బండ కొండాపూర్ కు చెందిన బిజెపి సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో మాజీ శాసనసభ్యుడు భిక్షపతి యాదవ్ సోదరుడు కీర్తిశేషులు మారబోయిన సత్యనారాయణ యాదవ్ 23వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బిజెపి రాష్ట్ర నాయకులు ఎం.రవికుమార్ యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా ఆ భగవంతుని ప్రార్ధించారు. అనంతరం వారి జ్ఞాపకార్థం మసీదు బండ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు అన్నదానం చేసి, భోజన ప్లేట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లేష్, ఆదిత్య కుమార్, ఉమేష్, క్రాంతి మాదిగ పాల్గొన్నారు.

మసీదుబండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here