- ఎంసిపిఐ(యు) పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సహాయకార్యదర్శి మైదం శెట్టి రమేష్ పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి: ఎంసిపిఐ(యు) పార్టీ మియాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్టాలిన్ నగర్ లో 12న జరిగే ధర్నా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎం సిపిఐయు గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి కామ్రేడ్ మైదం శెట్టి రమేష్ హాజరై మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు పెరుగుతున్న ధరలతో పాటు విద్యా వైద్యం ఉపాధి లాంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారన్నారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 12న శేరిలింగంపల్లి మండల కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్స్ పల్లె మురళి, ఇస్లావత్ దశరథ్ నాయక్, పార్టీ నాయకులు, మైదం శెట్టి రాణి, గూడ లావణ్య, దార లక్ష్మి, డి రంగా స్వామి, ఖాదర్ వలి పాల్గొన్నారు.
